పిఎంఇండియా
భూ మాత శాశ్వత స్ఫూర్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకుంటూ:
‘‘యస్యాం వృక్షా వానస్పత్యా ధ్రువాస్తిష్ఠన్తి విశ్వహా
పృథివీం ధేనుం ప్రదుహాం న ఉదిచ్ఛన్తు నమోస్తు పృథివ్యై’’ అని పేర్కొన్నారు.
ఈ సుభాషితం ‘‘మొక్కలనీ, వృక్షాలనీ సదా బలంగా, స్థిరంగా నిలిపి ఉంచుతున్న ఈ నేల.. మనకు అన్ని సుఖాలూ, సదుపాయాలతో పాటు వనరులని కూడా సమకూర్చు గాక. భూ మాతకు మనం నమస్కరిద్దాం’’ అనే సందేశాన్ని అందిస్తోంది.
భూమి మన తల్లి.. దీనిని పరిరక్షించుకోవడంలోనే మానవాళి సంక్షేమం ఇమిడివుంటుంది. పుడమిని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం, అంతేకాదు.. రాబోయే తరాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సిన పవిత్ర ప్రతిన కూడా అని శ్రీ మోదీ వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్నిపొందుపరుస్తూ –
‘‘పృథ్వి మన మాత. ధరణిని సంరక్షించుకోవడంలోనే మానవాళి సంక్షేమం నిహితమై ఉంది. దీనిని రక్షించడం మన సామూహిక బాధ్యత మాత్రమే కాకుండా, భావి తరాల వారి పట్ల మనం తీసుకోవాల్సిన పవిత్ర సంకల్పం కూడా.
‘‘యస్యాం వృక్షా వానస్పత్యా ధ్రువాస్తిష్ఠన్తి విశ్వః
పృథివీం ధేనుం ప్రదుహాం న ఉదిచ్ఛన్తు నమోస్తు పృథివ్యై’’ అని పేర్కొన్నారు.
पृथ्वी हमारी माता है और इसके संरक्षण में मानवता का कल्याण निहित है। इसकी रक्षा करना हम सबका केवल दायित्व नहीं, बल्कि आने वाली पीढ़ियों के प्रति हमारा पवित्र संकल्प भी है।
— Narendra Modi (@narendramodi) April 22, 2026
यस्यां वृक्षा वानस्पत्या ध्रुवास्तिष्ठन्ति विश्वहा।
पृथिवीं धेनुं प्रदुहां न उदिच्छन्तु नमोऽस्तु पृथिव्यै॥ pic.twitter.com/PqeuwZP79H