పిఎంఇండియా
సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ప్రయత్నం, సంయమనం, నైపుణ్యం, అప్రమత్తంగా ఉండడం, సహన గుణం, జ్ఞాపక శక్తి, ఏదైనా పనిని అన్నీ ఆలోచించిన తరువాతనే మొదలుపెట్టడం వంటివి మనిషి పురోగతికి మూల కారణాలు అవుతాయని ఆ సుభాషితం మనకు బోధిస్తుంది.
సహనంతో, అంకితభావంతో పట్టు బట్టి కృషి చేస్తే అసాధారణ విజయం అందుతుందని, ఇది దేశ సమృద్ధిలో, సామర్థ్యంలో ఓ కొత్త శక్తిని కూడా ప్రవహింపచేస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘సంయమనంతో, అంకిత భావంతో కష్టపడినప్పుడు అది అద్భుత విజయాన్ని అందిస్తుంది. ఇది దేశ సమృద్ధికి, సామర్థ్యానికి ఒక కొత్త శక్తిని కూడా ప్రవహింప చేస్తుంది.
ఉత్థానం సంయమో దాక్ష్యమప్రమాదో ధృతిః స్మృతిః
సమీక్ష్య చ సమారమ్భో విధ్ధిమూలం భవస్య తు.’’
ప్రయత్నం, సంయమనం, నైపుణ్యం, అప్రమత్తంగా ఉండడం, ఓర్పుతో మెలగడం, జ్ఞాపక శక్తిని పెంచుకోవడం, ఏదైనా పనిని బాగా ఆలోచించి మొదలుపెడుతుండడం.. ఇవన్నీ పురోగతికి మూల కారణాలు అవుతాయి’’ అని పేర్కొన్నారు.
***
संयम और समर्पण के साथ किया गया परिश्रम अद्भुत सफलता दे सकता है। इससे राष्ट्र की समृद्धि और सामर्थ्य को भी एक नई ऊर्जा मिलती है।
— Narendra Modi (@narendramodi) April 28, 2026
उत्थानं संयमो दाक्ष्यमप्रमादो धृतिः स्मृतिः।
समीक्ष्य च समारम्भो विद्धिमूलं भवस्य तु॥ pic.twitter.com/WSPXyBzWEm