Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇరాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అలీ ఫాలిహ్ కాధిమ్ అల్-జైదీకి ప్రధానమంత్రి అభినందనలు


ఇరాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫాలిహ్ కాధిమ్‌ అల్‌–జైదీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఇరాక్‌తో దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలకు భారత్ ఎంతో విలునిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయటానికి భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌‘లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

“ఇరాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫాలిహ్ కాధిమ్‌ అల్‌–జైదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఇరాక్‌తో సుదీర్ఘ, స్నేహపూర్వక సంబంధాలకు భారత్‌ ఎంతో విలువనిస్తుంది. అన్ని రంగాల్లోనూ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది.

వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన రెండు దేశాల ఉమ్మడి పురోగతి, వృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను“.

***