Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ భేటీ


ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిపార్లమెంటు సభ్యురాలు పెన్నీ వాంగ్‌తో సమావేశమవ్వడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో భారత్ఆస్ట్రేలియా మధ్య రక్షణవాణిజ్యంసాంకేతికతవస్తు సరఫరా వ్యవస్థ పటిష్టతను నిర్ధారించడం వంటి రంగాల్లో బలపడుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు చర్చించారు.

స్వేచ్ఛాయుతపారదర్శకసురక్షితసుసంపన్నమైన ఇండోపసిఫిక్ కోసం భారత్‌ఆస్ట్రేలియా ఎప్పటికీ కలిసి పనిచేస్తూనే ఉంటాయని ఇరు దేశాల నేతలు స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిపార్లమెంటు సభ్యురాలు పెన్నీ వాంగ్‌ను కలవడం సంతోషంగా ఉందిరక్షణవాణిజ్యంసాంకేతికతవస్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడటం వంటి రంగాల్లో విస్తరిస్తున్న భారత్ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి మేం చర్చించాంస్వేచ్ఛాయుతపారదర్శకసురక్షితమైనసుసంపన్నమైన ఇండోపసిఫిక్ కోసం భారత్ఆస్ట్రేలియా కలిసి పనిచేస్తూనే ఉంటాయి’’.

 

***