పిఎంఇండియా
గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ఈ వ్యాసం అమృత కాలంలో భారత్ పురోగమిస్తున్న క్రమంలో దేశమంతటా ప్రజలకు, మరీముఖ్యంగా మహిళలకు, యువతకు, రైతులకు ప్రయోజనాలను అందించిన ప్రభుత్వ కార్యక్రమాలను తెలియజేసింది. స్వామి వివేకానంద, తిరువళ్లువర్, సుబ్రమణ్య భారతిల నుంచి స్ఫూర్తిని పొందుతూ, 2047 కల్లా మన దేశాన్ని ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ వ్యాసం పిలుపునిచ్చింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘భారత్ అమృత కాలంలో పురోగమన పథంలో ముందుకు సాగుతున్న క్రమంలో, దేశవ్యాప్తంగా ప్రజలకు, మరీ ముఖ్యంగా మహిళలకు, యువతకు, రైతులకు ప్రయోజనాలను అందించిన ప్రభుత్వ కార్యక్రమాలను గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ వివరించారు.
స్వామి వివేకానంద, తిరువళ్లువర్, సుబ్రమణ్య భారతిల నుంచి స్ఫూర్తిని పొందుతూ, 2047 కల్లా మన దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా తీర్చిదిద్దడానికి కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చారు’’ అని పేర్కొంది.
As Bharat marches ahead during Amrit Kaal, Hon'ble @VPIndia Thiru @CPR_VP dwells on the government's initiatives that have benefited people across the country, particularly Nari Shakti, youth and farmers.
— PMO India (@PMOIndia) May 26, 2026
Drawing inspiration from Swami Vivekananda, Thiruvalluvar and Subramania… https://t.co/vwv3XpB8aq