పిఎంఇండియా
ఉత్తమ మానవుడి వ్యక్తిత్వానికి ‘వినమ్రత, క్షమాగుణం, సత్ప్రవర్తన’లే నిజమైన ఆభరణాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సద్గుణాలు ప్రాతిపదికగా ‘వికసిత్ భారత్’ సంకల్ప సాకారానికి దేశ ప్రజలు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా కింది సంస్కృత సుభాషితాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు.
“తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా
భవంతి సంపద దైవీమభిజాతస్య భారత” అంటే-
“తేజస్సు, క్షమాగుణం, అసమాన ధైర్యం, నిష్కపట ప్రవర్తన దేశంపై అంకితభావం, అహంకార రహిత వినయశీల వ్యక్తిత్వం- వంటి దైవిక సద్గుణాలు ఉత్తమ మానవుడి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే లక్షణాల”ని ఈ సుభాషితం వివరిస్తుంది.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“వినమ్రత, క్షమాగుణం, సత్ప్రవర్తన’ మానవుడి వ్యక్తిత్వానికి నిజమైన ఆభరణాలు. ఈ సద్గుణాలు ప్రాతిపదికగా నేటి పౌరులు ‘వికసిత భారత్’ సంకల్ప సాకారం కోసం అవిరళ కృషిని కొనసాగిస్తున్నారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
विनम्रता, क्षमाशीलता और उत्तम आचरण ही व्यक्तित्व के सच्चे आभूषण हैं। इन गुणों के साथ ही आज देशवासी विकसित भारत के संकल्प की सिद्धि में निरंतर जुटे हैं।
— Narendra Modi (@narendramodi) May 29, 2026
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता।
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत।। pic.twitter.com/5JuC5ITZAu