పిఎంఇండియా
జన్జాతి సురక్షా మంచ్ ప్రతినిధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
గిరిజన సమాజం పట్ల వారు కనబరుస్తున్న అంకిత భావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
మాటామంతీలో భాగంగా, గిరిజన సముదాయాల అభివృద్ధితో, సాధికారతతో ముడిపడిన వివిధ అంశాలపై చర్చించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘జన్జాతి సురక్షా మంచ్ ప్రతినిధులతో న్యూఢిల్లీలో సమావేశమయ్యే అవకాశం ఈ రోజు లభించింది. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకిత భావం ఎంతో ప్రశంసనీయం. గిరిజన సముదాయాల అభివృద్ధి, సాధికారతతో ముడిపడిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు చోటుచేసుకున్నాయి’’ అని పేర్కొన్నారు.
***
नई दिल्ली में आज जनजाति सुरक्षा मंच के प्रतिनिधियों से मुलाकात का अवसर मिला। आदिवासी समाज के लिए इनका समर्पण भाव बहुत सराहनीय है। इस दौरान जनजातीय समुदायों के विकास और उनके सशक्तिकरण से जुड़े विभिन्न विषयों पर सार्थक चर्चा हुई। pic.twitter.com/4Dc4v6GOL2
— Narendra Modi (@narendramodi) May 28, 2026