Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏటీఎఫ్ ధరల నిర్ధారణ దిశగా… భారతీయ విమానయాన సంస్థల కోసం ధరల స్థిరీకరణ నిధికి కేబినెట్ ఆమోదం


షెడ్యూల్డు భారతీయ విమానయాన సంస్థల దేశీయఅంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ పరంగా చేయూతనివ్వడం లక్ష్యంగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీలురూ.10,000 కోట్లకు మించకుండా ఏకమొత్తంగా బడ్జెట్ సాయాన్ని అందించేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందిపెట్రోలియంసహజ వాయు మంత్రిత్వ శాఖ గ్రాంట్ల ద్వారా.. చమురు మార్కెటింగ్ సంస్థలకు వడ్డీ లేని ముందస్తు నిధుల రూపంలో ఈ బడ్జెట్ సహాయం లభిస్తుందిపశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇంధన ధరల్లో నెలకొన్న అసాధారణమైన అనిశ్చితి నేపథ్యంలోధరల అస్థిరత కొనసాగుతున్న వేళ.. విమానయాన సంస్థలకు స్థిరమైన ధరల్లో ఏటీఎఫ్‌ను సరఫరా చేసేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఈ సహాయాన్ని అందిస్తారు.

 

ఆమోదించిన ధరల స్థిరీకరణ నిధిలో కీలకమైన అంశాలు:

 

(i) చమురు మార్కెటింగ్ కంపెనీలకు వడ్డీ లేని ముందస్తు నిధులు

షెడ్యూల్డు భారతీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ కోసం సాయమందించేలా.. చమురు మార్కెటింగ్ సంస్థలకు రూ. 10,000 కోట్ల వరకు వడ్డీ లేని ముందస్తు నిధుల రూపంలో ఏకమొత్తంగా బడ్జెట్ సాయాన్ని అందిస్తారుఆమోదిత విధానం మేరకు నిర్ణయించిన ప్రామాణిక ధర కన్నా ప్రస్తుత దిగుమతి ధర పెరిగిన సమయాల్లో.. అంతర్జాతీయంగా పెరిగిన ఏటీఎఫ్ ధరల వల్ల ఓఎంసీలకు వచ్చే నష్టాలను ఈ నిధి ద్వారా భర్తీ చేస్తారు.

 

(ii) తిరిగి రాబట్టుకోవడం, ధరల వ్యత్యాసాన్ని గుర్తించే విధానం

 

అంతర్జాతీయంగా ఏటీఎఫ్ ధరలు తగ్గినప్పుడు ఆ వ్యత్యాసం మొత్తాన్ని చమురు మార్కెటింగ్ సంస్థల నుంచి తిరిగి తీసుకుని భారత సంచిత నిధిలో జమచేస్తారు. అందించిన మొత్తం ఆర్థికసాయం పూర్తిగా తిరిగి వచ్చిసర్దుబాటు అయ్యేంత వరకు ఈ ఏర్పాటు కొనసాగుతుంది.

(iii) దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాల పరిధి

దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించాలనుకుంటున్న అన్ని షెడ్యూల్డు భారతీయ విమానయాన సంస్థలకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

 

(iv) స్థిరమైన ఏటీఎఫ్ ధర కోసం ఏర్పాటు

దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలకు నిర్దిష్ట ధరలను నిర్ణయించడం ద్వారా.. ఇంధన వ్యయానికి సంబంధించి మరింత మెరుగ్గా ముందస్తు అంచనాలకు ఈ యంత్రాంగం అవకాశాన్నిస్తుందితద్వారా ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం నుంచి విమానయాన సంస్థలకు రక్షణ లభిస్తుంది.

 

(v) చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఏటీఎఫ్ సరఫరా చేసే ప్రత్యేక హక్కులు

భాగస్వామ్య భారతీయ విమానయాన సంస్థలు, చమురు మార్కెటింగ్ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం ద్వారా ఈ విధానం అమలవుతుందిదీనిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖపెట్రోలియం – సహజ వాయు మంత్రిత్వ శాఖలు సంతకాలు చేస్తాయిఈ ఏకమొత్తం ఏర్పాటు ప్రకారం.. భాగస్వామ్య విమానయాన సంస్థలు మూడేళ్ల వరకు ఓఎంసీల నుంచి మాత్రమే ఏటీఎఫ్‌ను కొనుగోలు చేయాలిఅయితే ఇది వార్షిక సమీక్షకు లోబడిలేదా ముందస్తుగా ఇచ్చిన నిధి పూర్తిగా రీకవరీ అయ్యేంత వరకు (ఏది ముందయితే అదివర్తిస్తుంది.

 

(vi) పర్యవేక్షణ, ఆడిట్

 

పౌర విమానయాన మంత్రిత్వ శాఖపెట్రోలియం – సహజ వాయు మంత్రిత్వ శాఖవ్యయ విభాగాల ప్రతినిధులతో కూడిన పర్యవేక్షణ కమిటీ.. ఈ పథకం అమలుక్లెయిముల ధ్రువీకరణసమన్వయంసర్దుబాటు ప్రక్రియలను పర్యవేక్షిస్తుందిఆడిటింగ్‌కు లోబడి అన్ని క్లెయిమ్‌లురీకవరీలు జరుగుతాయి.

 

(vii) ధర స్థిరీకరణ సహాయ వ్యవధి

ఏటీఎఫ్ ధర స్థిరీకరణ సాయం 36 నెలల కాలం అమల్లో ఉంటుందిఇందులో వార్షిక సమీక్ష జరుగుతుందిలేదా ముందస్తు నిధులు పూర్తిగా రీకవరీసర్దుబాటు అయ్యే వరకు అమల్లో ఉంటుందిపై రెండు అంశాల్లో ఏది ముందుగా పూర్తయితే దానిని అమలుకు ప్రాతిపదికగా పరిగణిస్తారుఈ కాలపరిమితిలోగా నిధులు పూర్తిగా సర్దుబాటు చేయని పక్షంలో.. సంబంధిత ఆధీకృత సంస్థ ఆమోదంతో, 36 నెలలకు మించి కూడా ఈ ప్రతిపాదనను పొడిగించవచ్చు.

 

ఆశిస్తున్న ఫలితాలు:

 

ప్రతిపాదిత విధానం భారతీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల విషయంలో స్థిరత్వాన్ని మెరుగుపరచడంతోపాటు ముందస్తు అంచనాలను అందిస్తుంది. దాంతో మెరుగైన కార్యాచరణఆర్థిక ప్రణాళికకు వీలు కల్పిస్తుంది.

  • ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం వేళ.. అస్థిరఅధిక ఏటీఎఫ్ ధరల వల్ల కలిగే నష్టాల నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలను కాపాడుతుంది.

  • దేశీయ, అంతర్జాతీయ వైమానిక అనుసంధానాన్ని నిలబెట్టికొనసాగేలా చేయడం ద్వారా.. విమాన సేవలు అంతరాయం లేకుండా కొనసాగేలా ఈ చర్య ద్వారా సాధ్యపడుతుంది.

  • ఇది ఇంధన ధరల పెరుగుదల ప్రభావాన్ని ప్రయాణికులపై పడకుండా తగ్గిస్తుంది. తద్వారా చార్జీలు పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది.

  • మారుమూల, ప్రాంతీయద్వితీయతృతీయ శ్రేణి నగరాల్లో అంతరాయం లేకుండా విమాన ప్రయాణానికి దోహదపడడం ద్వారా.. సమతౌల్యంతో కూడిన ప్రాంతీయాభివృద్ధినిసమ్మిళిత వృద్ధిని ఈ విధానం ప్రోత్సహిస్తుంది.

ముఖ్య ప్రయోజనాలు:

  • అంతరాయం లేకుండా విమాన సేవలు కొనసాగడం ద్వారా.. విమానయాన సంస్థలువిమానాశ్రయాలుక్షేత్రస్థాయి నిర్వహణ సంస్థలునిర్వహణ – రిపేర్ల వ్యవస్థప్రయాణ సంస్థలుఆతిథ్య – వస్తు రవాణా రంగాల్లో ఉద్యోగాలకు ప్రమాదం ఉండదు.

  • అంతరాయం లేకుండా విమానయాన అనుసంధానం వల్ల ప్రయాణికుల రాకపోకలకుఅత్యధిక విలువ కలిగిన వస్తు రవాణాకువ్యాపారులూపర్యాటకుల ప్రయాణాలకు ఆటంకాలు ఉండవుదాంతో అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుంది.

  • పర్యాటకంఆతిథ్యంవాణిజ్యంఎగుమతులుప్రాంతీయాభివృద్ధిపెట్టుబడులతోపాటు పరోక్షంగా మరిన్ని అంశాల్లోనూ ప్రభుత్వ చర్య సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

  • ఉడాన్ పథకం కింద ప్రారంభించిన విమానాశ్రయాలు సహా.. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసిన విమానాశ్రయ మౌలిక సదుపాయాలను గరిష్టంగా వినియోగించుకోవడానికి ఇది సహాయపడుతుంది.

  • దేశీయఅంతర్జాతీయ అనుసంధానాన్ని కాపాడడం ద్వారా.. అంతర్జాతీయ మార్కెట్లతో భారత్ అనుసంధానాన్ని బలోపేతం చేసిదీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.

నేపథ్యం:

  • పశ్చిమాసియా సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏటీఎఫ్ ధరల్లో మునుపెన్నడూ లేనంత అస్థిరత వల్ల విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితమైంది.

  • పశ్చిమాసియాలో ప్రస్తుత సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఏటీఎఫ్ ధరలు అసాధారణంగా పెరిగాయి. 2026 మార్చిలో లీటరుకు రూ. 60.50గా ఉన్న ఏటీఎఫ్ ధర.. 2026 మే నాటికి లీటరుకు రూ. 142కుఅంటే దాదాపు 2.5 రెట్లు పెరిగిందిసాధారణంగా ఒక విమానయాన సంస్థ మొత్తం కార్యాచరణ వ్యయంలో ఏటీఎఫ్ వాటానే దాదాపు 40 శాతం వరకు ఉంటుందిఅందువల్ల ఏటీఎఫ్ ధరల్లో నెలకొన్న ఈ తీవ్రమైన అనిశ్చితి.. విమానయాన సంస్థల ఆర్థిక స్థితిగతులపై విపరీతమైన వ్యయ ఒత్తిడిని పెంచింది.

  • విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో ఏటీఎఫ్ వాటా దాదాపు 40 శాతంఇంధన ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్న సమయాల్లో మొత్తం నిర్వహణ వ్యయంలో ఇది 60 శాతం వరకు కూడా ఉండొచ్చు.

  • దేశీయ కార్యకలాపాల కోసం ఏటీఎఫ్ ధరలపై గరిష్ట పరిమితిని విధించగా.. అంతర్జాతీయ కార్యకలాపాల కోసం మాత్రం దిగుమతి ధరల వద్దే భారతీయ విమానయాన సంస్థలు ఏటీఎఫ్‌ను కొనుగోలు చేస్తున్నాయివిమానయాన సంస్థలకు ఇది భారంగా మారింది.

  • ఏటీఎఫ్ ధరలపై పరిమితి విధించడమన్నది తాత్కాలిక చర్య మాత్రమేఓఎంసీలకు దీర్ఘకాలంలో ఇది ఆచరణయోగ్యం కాదుఏటీఎఫ్ ధరలపై పరిమితులను విధించడం వల్ల.. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ఏటీఎఫ్ ధరల్లో అస్థిరతఅసాధారణ పెరుగుదలతో చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

  • భారత విమానయాన సంస్థలకు పాకిస్థాన్ గగనతలాన్ని మూసేయడం వల్ల ఐరోపాఉత్తర అమెరికామధ్య ఆసియాకు విమాన ప్రయాణ మార్గాల దూరం పెరిగిందిదీంతో ఇంధన వినియోగంనిర్వహణ ఖర్చులు పెరిగాయి.

  • సుదూర ప్రాంతాల ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగాయిఅంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిందిపలు అంతర్జాతీయ మార్గాల్లో విమానయాన సంస్థలు తమ సేవలను తగ్గించుకున్నాయి లేదా నిలిపేశాయి.   

***