Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కార్యాచరణకు పిలుపునిచ్చిన వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి ఉమ్మడి కార్యాచరణనీప్రజల భాగస్వామ్యాన్నీ కోరుతూ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలతో పంచుకున్నారు.
ఈ సవాళ్లను ప్రకృతి ఆధారిత పద్ధతులను అనుసరించి పరిష్కరించుకొందామని మంత్రి పిలుపునిచ్చారని ప్రధానమంత్రి ప్రస్తావించారుఆయా పద్ధతులు దీర్ఘకాలంపాటు ప్రభావాన్ని చూపేవీతక్కువ ఖర్చుతో కూడినవీపర్యావరణ ప్రయోజనాలను అందించగలవీ అయి ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
పచ్చదనంతో కళకళలాడే ఢిల్లీ.. అభివృద్ధిపర్యావరణ సంరక్షణ బాధ్యతల మధ్య సమతౌల్యాన్ని కాపాడడానికి భారత్ కనబరుస్తున్న నిబద్ధతకు ఒక ప్రతీక కాగలదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగాకేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పర్యావరణ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రకృతి ఆధారిత పరిష్కారాల ద్వారా ఉమ్మడి కార్యాచరణప్రజాభాగస్వామ్యం అవసరమంటూ పిలుపునిచ్చారుఆ పరిష్కారాలు దీర్ఘకాలం పాటు ప్రభావాన్ని చూపేవీతక్కువ ఖర్చుతో కూడినవీపర్యావరణానికి మేలు చేసేవీ అయి ఉండాలని ఆయన అన్నారు.

పచ్చదనంతో కళకళలాడే ఢిల్లీ.. అభివృద్ధితో పాటే పర్యావరణ సంరక్షణ బాధ్యతను కూడా సమతౌల్యం చేసుకోవాలన్న భారత్ నిబద్ధతకు ఒక ప్రతీక కాగలదని ఆయన స్పష్టం చేశారు’’ అని పేర్కొన్నారు.

***