Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వావలంబన, ఆవిష్కరణల ద్వారా గడచిన దశాబ్దంలో రక్షణ సామర్థ్యాల్లో భారత్ సాధించిన పరివర్తన గురించి వివరించిన ప్రధానమంత్రి


గత దశాబ్దంలో భారతదేశ రక్షణ సామర్థ్యాలలో వచ్చిన గణనీయమైన పరివర్తన గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు.

ఆత్మనిర్భరత లక్ష్యం ఆధారంగా.. ఆవిష్కరణలూసాంకేతిక పరిజ్ఞానమూస్వదేశీ తయారీ రంగం అందిస్తున్న శక్తితో భారతదేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ స్థాయిలో రూపాంతరం చెందాయని శ్రీ మోదీ అన్నారు.

స్వయం సమృద్ధిని సాధించడం ద్వారా జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని.. గత 12 ఏళ్లలో రక్షణ రంగంలో సాధించిన పురోగతి ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

గగనతలభూతలనావికా రంగాల్లో తన రక్షణ సామర్థ్యాలను భారత్ బలోపేతం చేసుకుందనీస్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుందనీ ప్రధానమంత్రి అన్నారుస్వావలంబనజాతీయ భద్రత కోసం బలమైన పునాదిని నిర్మించుకుందని తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘ఆత్మనిర్భరత లక్ష్యం అందిస్తున్న మార్గదర్శకత్వంలో ఆవిష్కరణలుసాంకేతిక పరిజ్ఞానందేశీయ తయారీ రంగం అందిస్తున్న ప్రోత్సాహంతో గత దశాబ్ద కాలంలో భారతదేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ స్థాయిలో మార్పులను సంతరించుకున్నాయిగత 12 సంవత్సరాలుగా రక్షణ రంగంలో భారతదేశం సాధించిన పురోగతిని ఈ థ్రెడ్ క్లుప్తంగా తెలియజేస్తుంది.

 

‘‘గగనతలభూతలనావికా రంగాల్లో భారత్ తన రక్షణ సామర్థ్యాలనూఅధునాతన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలనూ ఎలా బలోపేతం చేసుకుందో ఈ థ్రెడ్ వివరిస్తుందిస్వావలంబన సాధించడానికిజాతీయ భద్రతకు అవసరమైన బలమైన పునాదిని ఎలా నిర్మించుకున్నదీ తెలియజేస్తుంది’’.

 

***