Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం, న్యాయాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంపై వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


కేంద్ర సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి, సులభతర న్యాయాన్ని ప్రోత్సహించడానికి, పౌరులకు ప్రజా సేవలను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ వ్యాసం తెలియజేస్తుంది. డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు… న్యాయవాదులు, న్యాయమూర్తుల పనితీరును మరింత సులభతరం చేశాయని ఇందులో ప్రముఖంగా ప్రస్తావించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

‘‘న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి, సులభతర న్యాయాన్ని ప్రోత్సహించడానికి, పౌరులకు సేవలను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వ్యాసంలో వివరించారు. 

డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వల్ల న్యాయవాదులు, న్యాయమూర్తుల విధులకు మరింత వెసులుబాటు కలిగిందని ఆయన ఇందులో తెలియజేశారు”.

***