Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోల్‌కతాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని


కోల్‌కతాలో జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటనలో ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ విషాదంలో ఆప్తులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధిత ప్రజలకు స్థానిక యంత్రాంగం సాయమందిస్తోందని తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

కోల్‌కతాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడం అత్యంత విచారకరం. ఈ విషాదంలో ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. బాధితులకు స్థానిక యంత్రాంగం సాయమందిస్తోంది: ప్రధానమంత్రి @నరేంద్రమోదీ’’