పిఎంఇండియా
ప్రపంచ సంస్కృత దినోత్సవంతోపాటు ఈ రోజు శ్రావణపూర్ణిమ కావడంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతల నిరంతర వాహినియైన సంస్కృతం శాశ్వతత్వం ఘనతను మనం ఇవాళ వేడుక చేసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. “ఈ ప్రత్యేక పర్వదినం నాడు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం అభ్యసించే, బోధించే ప్రతి ఒక్కరినీ మనం అభినందిద్దాం. వారందరూ ఈ భాషలోని అక్షయ నిధిని భవిష్యత్తరాలకు వారసత్వంగా ప్రసాదించేందుకు అవిరళ కృషి చేస్తున్నారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“విశ్వసంస్కృతదివసస్య శుభాశయః
అద్య, శ్రవణపూర్ణిమాదినే, వయం సంస్కృతస్య చిరంతన్-సమృద్ధేః
ఉత్సవం ఏష భాషా భారతస్య జ్ఞానస్య, చింతనస్య,
సర్జనశీలతాయః చ నిరంతర-సంవాహికా ఆశీతు తస్యాః
సకారాత్మకః ప్రభావః బహుషు క్షేత్రేషు అద్యాపి ద్రష్టుం శక్యతే।“ అని ప్రధానమంత్రి సంస్కృత శ్లోకాన్ని ఉటంకించారు.
అంటే- “ఈ శ్రావణ పౌర్ణమినాడు, మనం సంస్కృత వైభవాన్ని స్మరించుకుంటూ వేడుక చేసుకుంటున్నాం. ఈ భాష భారతీయ జ్ఞానాన్ని, ఆలోచనను, సృజనాత్మకతను నిరంతర ప్రపంచానికి అందిస్తోంది. దాని సానుకూల ప్రభావం నేటికీ అనేక రంగాల్లో ప్రస్ఫుటమవుతుంది” అని అర్థం… అలాగే,
ఏతస్మిన్ విశిష్టే దినే, భారతే విశ్వే చ యే సంస్కృతం పఠన్తి,
పాఠయంతి తథా ఏతః ॥ కాలాతీతం నిధిం
అగ్రిమసన్తత్యై ప్రాపయితుం ప్రయత్నశీలః శాంతి తాన్ సర్వాన్ వయం ప్రశంస.
అంటే- “ఈ పవిత్ర పర్వదినాన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం అభ్యసించే, బోధించే, అందులో అనాదిగా లభించే అక్షయ నిధిని భవిష్యత్తరానికి సంక్రమింపజేయడంలో కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ మనం అభినందిద్దాం” అని అర్థం.
***
विश्वसंस्कृतदिवसस्य शुभाशयाः।
— Narendra Modi (@narendramodi) August 28, 2026
अद्य, श्रावणपूर्णिमादिने, वयं संस्कृतस्य चिरन्तन-समृद्धेः उत्सवम् आचरामः। एषा भाषा भारतस्य ज्ञानस्य, चिन्तनस्य, सर्जनशीलतायाः च निरन्तर-संवाहिका आसीत्। तस्याः सकारात्मकः प्रभावः बहुषु क्षेत्रेषु अद्यापि द्रष्टुं शक्यते।
एतस्मिन् विशिष्टे दिने,…