ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నేటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. రబీ 2026–27 సీజన్‌కు (01 అక్టోబర్ 2026 నుంచి 31 మార్చి 2027 వరకు) ఫాస్ఫేటిక్, పొటాషిక్ (పీ అండ్ కే) ఎరువులపై పోషకాల ఆధారిత రాయితీ (ఎన్బీఎస్) ధరలకు ఆమోదం లభించింది. రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి ఈ రాయితీల కోసం తాత్కాలికంగా సుమారు రూ.62,370.02 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా. రబీ 2025–26 సీజన్‌కు కేటాయించిన రూ.37,952.29 కోట్లతో పోలిస్తే ఇది సుమారు రూ.24,417.73 కోట్లు అధికం.
ప్రయోజనాలు..
· రైతులకు రాయితీపై, అందుబాటులో, సరసమైన ధరలకు ఎరువులు లభించేలా చూడటం.
· అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని పీ అండ్ కే ఎరువులపై రాయితీని హేతుబద్ధీకరించారు.
అమలు వ్యూహం, లక్ష్యాలు..
రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు నిరంతరాయంగా లభించేలా చూడటానికి రబీ 2026–27 సీజన్‌కు (01 అక్టోబర్ 2026 నుంచి 31 మార్చి 2027 వరకు) ఆమోదించిన ధరల ప్రకారం డీఏపీ, ఎన్పీకేఎస్ గ్రేడ్లతో సహా ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులపై సబ్సిడీ అందించనున్నారు.
నేపథ్యం..
డీఏపీ సహా 28 రకాల ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులను… తయారీదారులు, దిగుమతిదారుల ద్వారా ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ధరలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన పోషకాల ఆధారిత రాయితీ(ఎన్బీఎస్) పథకం పరిధిలో పీ అండ్ కే ఎరువులపై సబ్సిడీని అందిస్తున్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే విధానంలో భాగంగా రైతులకు అందుబాటు ధరల్లో పీ అండ్ కే ఎరువులు లభించేలా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
యూరియా, డీఏపీ, ఎంఓపీ, సల్ఫర్ వంటి ఎరువులు, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్థాల అంతర్జాతీయ ధరల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని.. డీఏపీ, ఎన్పీకేఎస్ గ్రేడ్లతో సహా ఫాస్ఫేటిక్, పొటాషిక్ (పీ అండ్ కే) ఎరువులకు రబీ 2026–27 సీజన్‌కు (01 అక్టోబర్ 2026 నుంచి 31 మార్చి 2027 వరకు) వర్తించే పోషకాల ఆధారిత రాయితీ (ఎన్బీఎస్) ధరలను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమోదించిన, నోటిఫై చేసిన ధరల ప్రకారం ఎరువుల కంపెనీలకు ఈ రాయితీని అందించనున్నారు. తద్వారా రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు లభించేలా చర్యలు తీసుకోనున్నారు.
***