Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రగతిశీల దేశ సామర్థ్యం, శక్తి పునాదుల గురించి తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ఈ రోజు పంచుకున్నారు. తపస్సు, ధర్మాచరణ, అందరి సంక్షేమాన్ని కోరుకునే భావనపైనే అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్న దేశానికున్న సామర్థ్యం, శక్తి ఆధారపడి ఉంటాయని అది తెలియజేస్తోంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘భద్రమిచ్ఛన్త ఋషయః స్వర్విదస్తపో దీక్షాముపనిషేదురగ్రే।

తతో రాష్ట్రం బలమోజశ్చ జాతం తదస్మై దేవా ఉపసన్నమన్తు॥’’

అందరి మేలు కోరే జ్ఞానులైన ఋషులు మొదట తపస్సు, దీక్షలను ఆచరించారు. ఆ తపస్సు, ఆచారాల వల్లే దేశం, బలం, శక్తి ఆవిర్భవించాయి. అలాంటి ప్రగతిశీల దేశానికి, దాని సామర్థ్యానికి దేవతలందరూ నమస్కరిస్తారు.

***