పవిత్ర భాయ్‌దూజ్ పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
తోబుట్టువుల మధ్య ఉండే ఆత్మీయ బంధంలోని అనురాగానికి, గాఢమైన ఆత్మీయతకు ఈ పవిత్రమైన పండగ ప్రతీక అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ శుభదినాన అందరికీ ఆనందం, సంతోషం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ భాయ్‌దూజ్ శుభాకాంక్షలు.
తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమపూర్వకమైన, బలమైన బంధంలోని మాధుర్యాన్ని, సాన్నిహిత్యాన్ని ఈ పవిత్రమైన పండుగ సూచిస్తుంది.
ఈ శుభ సందర్భంలో అందరికీ ఆనందం, సౌభాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’
***
देशभर के मेरे परिवारजनों को भाई दूज की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व भाई-बहन के स्नेहपूर्ण एवं प्रगाढ़ रिश्ते की मिठास और आत्मीयता का प्रतीक है। इस शुभ अवसर पर मैं सभी की प्रसन्नता और संपन्नता की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) November 11, 2026