పిఎంఇండియా
నార్వే రాజు అయిదో హెరాల్డ్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ సంవత్సరం మొదట్లో నార్వేలో తాను పర్యటించినప్పుడు రాజుతో భేటీ కావడాన్ని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయన కనబరిచిన ప్రేమను, నార్వే ప్రజల పట్ల, నార్వే పట్ల ఆయనకు ఉన్న గొప్ప సేవాభావనను కూడా శ్రీ మోదీ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు..:
‘‘నార్వే రాజు అయిదో హెరాల్డ్ ఇక లేరని తెలిసి ఎంతో చింతించాను.
ఈ ఏడాది మొదట్లో నార్వేలో నేను పర్యటించిన కాలంలో, రాజు గారితో భేటీ నాకింకా ఎంతో బాగా గుర్తుంది. దేశం పట్ల ఆయనకున్న ప్రేమ, సేవాభావం నన్నెంతో ప్రభావితం చేశాయి.
రాజ కుటుంబానికి, నార్వే ప్రజలకి సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’.
Deeply saddened by the passing of His Majesty King Harald V of the Kingdom of Norway.
— Narendra Modi (@narendramodi) August 28, 2026
I fondly recall meeting His Majesty during my visit to Norway earlier this year and was deeply touched by his warmth and profound sense of service to his nation.
My heartfelt condolences to… pic.twitter.com/PtySMBSVz4