Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఈ రోజు మంగళప్రదమైన జన్మాష్టమి. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఓ సుభాషితాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, శ్రీకృష్ణ భగవానుని పట్ల తనకున్న ఎనలేని భక్తి, శ్రద్ధలను చాటారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కొన్ని సందేశాలను ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘జన్మాష్టమిని పురస్కరించుకొని మీకందరికీ అనేకానేక శుభకామనలు. భగవాన్ శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో పనులను స్వార్థరహితంగా చేయాలనే అద్భుత స్ఫూర్తి ఇమిడి ఉంది. కలకాలం నిలిచే మార్గదర్శకత్వాన్ని మానవాళికి శ్రీకృష్ణుడు అందించారు. ఆయన పట్ల భక్తి, ఆయన ఆరాధనకు అంకితం అయినటువంటి ఈ పవిత్ర సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో సకారాత్మక ఉత్సాహాన్ని, శక్తిని ప్రవహింప చేయాలి అని నేను కోరుకుంటున్నాను. జయ శ్రీకృష్ణ.’’
‘‘వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్
దేవకీపరమానన్దం కృష్ణం వన్దే జగద్‌గురుమ్.’’
వసుదేవుని పుత్రుడు, దివ్యత్వానికి సాక్షాత్ స్వరూపంగా నిలిచిన వాడు, కంసుడిని, చాణూరుడిని సంహరించిన వాడు, దేవకి మాతకు పరమానందాన్ని ఇచ్చిన వాడు, జగత్తునకు గురువు అయిన భగవాన్ కృష్ణునికి ప్రణమిల్లుతున్నాను.’’

 

***