Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈఓఎస్-05తో కూడిన జీఎస్ఎల్వీ-ఎఫ్17ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోను ప్రశంసించిన ప్రధానమంత్రి


ఇస్రో ఈ రోజు సాధించిన మరో అద్భుత విజయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది దేశానికి గర్వ కారణమని ఆయన పేర్కొన్నారు.

జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహమైన ఈవోఎస్-05ను మోసుకెళ్తున్న జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగ విజయం… భారత అంతరిక్ష రంగం శ్రేష్ఠత, ఆవిష్కరణలు, మెరుగవుతున్న సామర్థ్యాలకు నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఇస్రో, భారత పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం అంతరిక్ష కార్యక్రమానికి కొత్త బలాన్ని, పరిధిని చేకూరుస్తూ… మొత్తం అంతరిక్ష వ్యవస్థలో భారత్ సామర్థ్యాలను విస్తరింపజేస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ఇస్రో మరో అద్భుతమైన విజయం సాధించింది. ఇది మన దేశానికి గర్వకారణం.

జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్-05ను మోసుకెళ్తున్న జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగ విజయం… భారత అంతరిక్ష రంగం శ్రేష్ఠత, ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు నిదర్శనం.

ఇస్రో, భారత పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం మన అంతరిక్ష కార్యక్రమానికి కొత్త బలాన్ని, పరిధిని చేకూరుస్తూ… మొత్తం అంతరిక్ష వ్యవస్థలో భారత్ సామర్థ్యాలను విస్తరింపజేస్తోంది.”