పిఎంఇండియా
కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
భారతదేశంలో గురువులను గౌరవించే సంప్రదాయం… జ్ఞానాన్ని అందించేవారిపై ఉన్న అపారమైన గౌరవాన్ని సూచిస్తుందని కేంద్రమంత్రి కథనంలో పేర్కొన్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. విద్యార్థిని సమాచారం నుంచి అవగాహన దిశగా, అవగాహన నుంచి జ్ఞానం వైపు నడిపించటంలో ఉపాధ్యాయుని కీలక పాత్రను కథనం తెలియజేస్తుందని చెప్పారు. విద్యలో విద్యార్థులకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన జాతీయ విద్యా విధానం-2020… ఈ దిశగా కీలక ముందడుగు వేసిందని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
“భారతదేశంలో ఉపాధ్యాయులను గౌరవించే సంప్రదాయం కొనసాగటం, జ్ఞానాన్ని పంచే గురువులపై ఉన్న అపారమైన గౌరవాన్ని సూచిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి కథనంలో పేర్కొన్నారు.
విద్యార్థిని సమాచారం నుంచి అవగాహన దిశగా, అవగాహన నుంచి జ్ఞానం వైపు నడిపించటంలో ఉపాధ్యాయుని కీలక పాత్రను తెలియజేశారు. విద్యలో విద్యార్థులకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన జాతీయ విద్యా విధానం-2020… ఈ దిశగా కీలక ముందడుగు వేసిందని తెలిపారు“
****
Union Education Minister Shri @JoshiPralhad writes that India's continuing tradition of celebrating teachers reflects the deep respect accorded to those who impart knowledge.
— PMO India (@PMOIndia) September 5, 2026
He highlights the teacher's vital role in guiding the learner from information towards understanding and… https://t.co/2ntAbjVtXE