Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మానవాళిని తీర్చిదిద్దే పవిత్ర కర్తవ్యం బోధన: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాసిన ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

 

జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, ప్రేరణను అందించడం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని శ్రీమతి రాష్ట్రపతి పేర్కొన్న విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచనను, జిజ్ఞాసను ప్రోత్సహించడం అనే పవిత్ర కర్తవ్యమే బోధన అని రాష్ట్రపతి తన వ్యాసంలో పేర్కొన్నారని ఆయన తెలిపారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండే, అంత్యోదయ ఆదర్శాన్ని అనుసరించే, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండే, “దేశమే ప్రథమం” అనే భావనను పాటించే మంచి మానవులుగా విద్యార్థులను తీర్చిదిద్దేలా వారికి మార్గనిర్దేశం చేయాలని రాష్ట్రపతి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

 

“జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, ప్రేరణను అందించడం ద్వారా ఉపాధ్యాయులు భవిష్యత్తును తీర్చిదిద్దుతారని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు పేర్కొన్నారు.

 

మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచనను, జిజ్ఞాసను ప్రోత్సహించడం అనే పవిత్ర కర్తవ్యమే బోధన అని ఆమె వివరించారు.

 

సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండే, అంత్యోదయ ఆదర్శాన్ని అనుసరించే, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండే, ‘దేశమే ప్రథమం’ అనే భావనను పాటించే మంచి మానవులుగా విద్యార్థులను తీర్చిదిద్దేలా వారికి మార్గనిర్దేశం చేయాలని ఆమె ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.”

 

***