పిఎంఇండియా
మహనీయుడు డాక్టర్ భూపేన్ హజారికా శత జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
డాక్టర్ భూపేన్ హజారికా గళం అస్సాం ఆత్మతో పాటు ఈశాన్య ప్రాంతాల ఉత్సాహాన్ని దేశం నలుమూలలకూ చేరవేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. డాక్టర్ హజారికా తన సంగీతంతో అసంఖ్యాకుల ఆలోచనలను, భావాలను సుందరంగా వ్యక్తీకరించారనీ, ప్రజలను చేరువగా తీసుకువచ్చారనీ ప్రధానమంత్రి వర్ణించారు.
కిందటి సంవత్సరం గువాహాటీలో డాక్టర్ హజారికా శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి జ్ఞాపకాలను శ్రీ మోదీ ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు.
భూపేన్ దా జీవితం, ఆయన సృజనలు భావి తరాల వారికి కూడా స్ఫూర్తిని అందిస్తుంటాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘మహానుభావుడు డాక్టర్ భూపేర్ హజారికా గారిని ఆయన వందో జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నాను.
ఆయన గళం అస్సాం ఆత్మనీ, ఈశాన్య ప్రాంతాల ఉత్సాహాన్నీ దేశ ప్రజలందరి చెంతకు చేరవేసింది.
ఆయన తన సంగీతంతో అసంఖ్యాకుల ఆలోచనలను, భావనలను సుందరంగా వ్యక్తీకరించారు. ఆయన పాటలు ప్రజలను సన్నిహితం చేశాయి.
కిందటి ఏడాది గువాహాటీలో ఆయన శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాలుపంచుకోవడాన్ని
నేను ఆప్యాయంగా గుర్తుచేసుకుంటున్నాను. భూపేన్ దా జీవితం, ఆయన సృజనలు రాబోయే తరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి’’ అని పేర్కొన్నారు.
***
On his 100th birth anniversary, remembering the legendary Dr. Bhupen Hazarika Ji.
— Narendra Modi (@narendramodi) September 8, 2026
His voice carried the soul of Assam and the spirit of the Northeast to the entire nation.
Through his music he beautifully gave expression to the thoughts and spirit of countless people. His… pic.twitter.com/92YZ7B52ld
কিংবদন্তি ড° ভূপেন হাজৰিকা দেৱক তেখেতৰ জন্ম শতবাৰ্ষিকীত শ্ৰদ্ধাৰে সুঁৱৰিছোঁ।
— Narendra Modi (@narendramodi) September 8, 2026
তেখেতৰ কণ্ঠই সমগ্ৰ দেশবাসীৰ ওচৰলৈ অসমৰ আত্মা আৰু উত্তৰ-পূৰ্বাঞ্চলৰ স্বাভিমান বহন কৰিছিল।
সংগীতৰ জৰিয়তে তেখেতে অগণন জনগণৰ চিন্তা আৰু ভাৱনাক সুন্দৰভাৱে প্ৰকাশ কৰিছিল। তেখেতৰ গীতে মানুহক অধিক ওচৰ চপাই… pic.twitter.com/4L9q9PmGQn