పిఎంఇండియా
త్వరలో జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాలుపంచుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి నేతలు తరలిరానున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ సంక్షేమ ఆకాంక్ష నుంచి స్ఫూర్తిని పొంది, వివిధ అంశాలపై సకారాత్మక, అర్థవంత చర్చలు చోటు చేసుకొంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
‘‘సద్భిరేవ సహాసీత సద్భిః కుర్వీత సంగతిమ్, సద్భిర్వివాదం మైత్రీం చ నాసద్భిః కించిదాచరేత్’’ అన్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
వ్యక్తి ఎల్లవేళలా సద్గుణాలు కలిగిన వారి మధ్యే ఉంటూ వారి సాంగత్యాన్ని అలవరుచుకోవాలి. మనిషి సత్ప్రవర్తన కలిగిన వారితో మాట్లాడుతూ స్నేహపూర్వక సంబంధాలను పెంచుకోవాలి. పరస్పర సద్బావన, చర్చ, మైత్రీపూర్వక సంబంధాలు శాంతినీ, సహకారాన్నీ పటిష్ఠపరుస్తాయన్న సందేశాన్ని ఈ సుభాషితం అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘రాబోయే కొన్ని రోజుల్లో ప్రపంచస్థాయి నేతలు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రపంచ సంక్షేమాన్ని అభిలషిస్తూ వివిధ అంశాలపై సకారాత్మక, సార్థక చర్చ జరుగుతుందన్న నమ్మకముంది.
సద్భిరేవ సహాసీత సద్భిః కుర్వీత సంగతిమ్, సద్భిర్వివాదం మైత్రీం చ నాసద్భిః కించిదాచరేత్’’ అని పేర్కొన్నారు.
***
अगले कुछ दिनों में दुनियाभर के नेता BRICS Summit के लिए जुटेंगे। पूर्ण विश्वास है कि सम्मेलन में विश्व कल्याण की कामना के साथ विभिन्न मुद्दों पर सकारात्मक और सार्थक चर्चा होगी।
— Narendra Modi (@narendramodi) September 11, 2026
सद्भिरेव सहासीत सद्भिः कुर्वीत सङ्गतिम्।
सद्भिर्विवादं मैत्रीं च नासद्भिः किंचिदाचरेत्॥ pic.twitter.com/YG36WlpiYg