కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), పింఛనుదారులకు కరువు ఉపశమనం (డీఆర్) అదనపు విడత మంజూరుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026 జూలై 1 నుంచి వర్తించేలా ఈ పెంపును ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వేతనం, పింఛనుపై 60 శాతంగా ఉన్న డీఏ, డీఆర్ రేటును మరో 3 శాతం పెంచుతారు. ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది.
కరువు భత్యం, కరువు ఉపశమనం పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి అదనంగా రూ.10,016.10 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయంతో సుమారు 48.54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.71 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందనున్నారు.
7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన విధానం ప్రకారమే ఈ పెంపును నిర్ణయించారు.