పిఎంఇండియా
ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఒంటికొమ్ము ఖడ్గమృగాన్ని గౌరవిస్తూ, వాటి సంరక్షణలో ముందున్న వారందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖడ్గమృగాల్లో దాదాపు 80 శాతం అస్సాంలో ఉన్నాయని, ఖడ్గమృగాల వేటను అరికట్టేందుకు కాజిరంగా చేస్తున్న ప్రయత్నాలకు విస్తృతంగా ప్రశంసలు వచ్చాయని పేర్కొన్నారు.
బీహార్, పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఖడ్గమృగాలు మళ్లీ కనిపించాయని, అవి సరైన సంరక్షణలో ఉన్నాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని దుధ్వాలో ఖడ్గమృగాల పునః ప్రవేశం విజయవంతమవటం చరిత్ర సృష్టించినట్లు చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణ పట్ల ఆయా రాష్ట్రాల ప్రజలు నిరంతరం చూపుతున్న నిబద్ధత, క్రీయాశీలక వన్యప్రాణి నిర్వహణను ఇది తెలియజేస్తోందన్నారు. దేశంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ, ఆవాసాల నిర్వహణ, జన్యుపరమైన మెరుగుదల, జనాభా సంఖ్య మార్పులను అధ్యయనం చేయటంలో ఆయా రాష్ట్రాలకు ఆర్థిక, సాంకేతిక సాయం అందించేందుకు ప్రాజెక్టు రైనోను ప్రారంభించినట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘ పోస్టులో ప్రధానమంత్రి ఇలా రాశారు.
“ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఒంటికొమ్ము ఖడ్గమృగాన్ని మనం గౌరవిస్తాం. వాటి సంరక్షణలో ముందున్న వారందరినీ ప్రశంసిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖడ్గమృగాల్లో దాదాపు 80 శాతం అస్సాంలో ఉన్నాయి. ఖడ్గమృగాల వేటను అరికట్టేందుకు కాజిరంగా ప్రయత్నాలకు విస్తృతంగా ప్రశంసలు వచ్చాయి.
ఒకవైపు బీహార్, పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఖడ్గమృగాలు మళ్లీ కనిపించాయి. అవి సరైన సంరక్షణలో ఉన్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని దుధ్వాలో ఖడ్గమృగాల విజయవంతమైన పునః ప్రవేశం చరిత్ర సృష్టించింది. వన్యప్రాణుల సంరక్షణ పట్ల ఆయా రాష్ట్రాల ప్రజలు నిరంతరం చుపుతున్న నిబద్ధత, క్రీయాశీలక వన్యప్రాణి నిర్వహణను ఇది తెలియజేస్తోంది.
దేశంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ, ఆవాసాల నిర్వహణ, జన్యుపరమైన మెరుగుదల, జనాభా సంఖ్య మార్పులను అధ్యయనం చేయటంలో ఆయా రాష్ట్రాలకు ఆర్థిక, సాంకేతిక మద్దతు కోసం ప్రాజెక్టు రైనోను ప్రారంభించినట్లు తెలియజేసేందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా“.
***
On World Rhino Day, we celebrate the magnificent greater one-horned rhinoceros and laud all those at the forefront of its protection.
— Narendra Modi (@narendramodi) September 22, 2026
Assam now holds nearly 80% of the world’s rhino population and Kaziranga’s efforts to end rhino poaching have been extensively appreciated.
On… pic.twitter.com/RclogJ84w1