పిఎంఇండియా
మహిళల సాండా 60 కిలోల పోటీలో రజత పతకాన్ని గెలుచుకున్న నోరమ్ రోశిబినా దేవిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పతకాలు గెలుచుకోవడం ప్రశంసాపూర్వక విజయమని ప్రధానమంత్రి అన్నారు. రోశిబినా దేవి నిలకడతనం, సాహసం, దృఢసంకల్పం నిజంగా కొనియాడదగినవని ప్రధాని అన్నారు. ఆమె భావి ప్రయత్నాల్లో రాణించాలని శ్రీ మోదీ కోరుకుంటూ, శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘మహిళల సాండా 60 కేజీ ఈవెంట్‌లో రజత పతకాన్ని నోరమ్ రోశిబినా దేవి గెలుచుకున్నందుకు అభినందనలు. వరుసగా 3 ఆసియా క్రీడల్లో పతకాలు సాధించడం ప్రశంసనీయ విజయం. ఆమె నిరంతరత్వం, సాహసం, పట్టుదల నిజంగా మెచ్చుకోదగినవి.
రాబోయే కాలంలో కూడా ఆమె రాణించాలని నేను ఆకాంక్షిస్తున్నాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’.
***
Congratulations to Naorem Roshibina Devi on winning the Silver Medal in the Women’s Sanda 60kg event. This is a noteworthy achievement…winning medals in 3 consecutive Asian Games. Her consistency, courage and determination are truly commendable.
— PMO India (@PMOIndia) September 24, 2026
Best wishes for all future… pic.twitter.com/07liuWPiEA