Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సత్యం, ఆహ్లాదం, ఉపకారంతో కూడిన మాటలకున్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ.. సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని


సమాజంలో శాంతిని, సామరస్యాన్ని పెంపొందించడంలో సత్యం, ఆహ్లాదం, ఉపకారంతో కూడిన మాటలకూ, మాట్లాడే సమయంలో క్రమశిక్షణ పాటించడానికీ ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధాని పంచుకున్నారు

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా రాశారు:

‘‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్

స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ||’’

ఇతరుల మనసుకు కలత కలిగించకుండా ఎప్పుడూ సత్యమైన, ఆహ్లాదకరమైన, ఉపకారమైన మాటలనే మాట్లాడాలి. పవిత్రమైన జ్ఞానాన్ని నిరంతరం అధ్యయనం చేయడం, మననం చేసుకోవడం ద్వారా మన మాటకు నిజమైన సార్థకత చేకూరుతుంది. ఆలోచనతో నిండిన మాటలు సమాజంలో శాంతినీ, సామరస్యాన్నీ, సానుకూలతనూ పెంపొందిస్తాయి.

***