పిఎంఇండియా
ఉత్తరప్రదేశ్.. గ్రేటర్ నోయిడాలో ఓ బస్సులో మంటలు చెలరేగి ప్రాణనష్టం జరిగిందని తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు.
ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50,000 చొప్పున అందిస్తారని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘ఉత్తరప్రదేశ్.. గ్రేటర్ నోయిడాలో ఓ బస్సులో మంటలు చెలరేగి ప్రాణనష్టం కలిగిందని తెలిసి చింతించాను. ప్రాణాలు కోల్పోయిన వారికి నేను సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్గ్రేషియాను అందిస్తారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఇస్తారు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’.
***
Distressed to hear about the loss of lives due to a fire tragedy on a bus in Greater Noida, Uttar Pradesh. Condolences to those who have lost their loved ones. Praying for the swift recovery of the injured.
— PMO India (@PMOIndia) September 24, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin…