పిఎంఇండియా
ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, కార్యసాధనా సామర్థ్యం, జ్ఞానం, వీరత్వం వంటి ఆరు గుణాలను తెలిపే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ గుణాలను అలవరచుకున్న వ్యక్తి… విజయం సాధించేందుకు దైవానుగ్రహాన్ని పొందుతాడని స్పష్టం చేశారు.
సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి:
ఉద్యమః సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమః
షడేతే యత్ర వర్తన్తే తత్ర దైవం సహాయకృత్
ఏ వ్యక్తి అయితే ఈ ఆరు గుణాలు… ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, కార్యసాధనా సామర్థ్యం, జ్ఞానం, వీరత్వం కలిగి ఉంటాడో, అతను విజయం సాధించేందుకు దైవ సహాయాన్ని పొందుతాడని ఈ సుభాషితం తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
ఉద్యమః సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమః
షడేతే యత్ర వర్తన్తే తత్ర దైవం సహాయకృత్
उद्यमः साहसं धैर्यं बुद्धिः शक्तिः पराक्रमः।
— Narendra Modi (@narendramodi) September 29, 2026
षडेते यत्र वर्तन्ते तत्र दैवं सहायकृत्॥ pic.twitter.com/LTBPxDbYtG