Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల్లో పురుషుల 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించిన గుల్వీర్‌ సింగ్‌కు ప్రధానమంత్రి అభినందన


ఆసియా క్రీడల్లో పురుషుల 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించిన గుల్వీర్‌ సింగ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అభినందించారు.

ఇది గుల్వీర్‌  వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కావడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గుల్వీర్‌ సింగ్‌ సాధించిన విజయానికి భారత్‌ గర్విస్తోందని శ్రీ మోదీ తెలిపారు.

“ఆసియా క్రీడల్లో పురుషుల 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించిన గుల్వీర్‌ సింగ్‌కు శుభాకాంక్షలు! ఇది అతని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కావడంతో ఈ విజయం మరింత ప్రత్యేకం. గుల్వీర్‌ సింగ్‌ సాధించిన విజయానికి  భారత్‌ గర్విస్తోంది” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పేర్కొంది.