పిఎంఇండియా
ఆసియా క్రీడల్లో పురుషుల 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించిన గుల్వీర్ సింగ్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఇది గుల్వీర్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కావడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గుల్వీర్ సింగ్ సాధించిన విజయానికి భారత్ గర్విస్తోందని శ్రీ మోదీ తెలిపారు.
“ఆసియా క్రీడల్లో పురుషుల 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించిన గుల్వీర్ సింగ్కు శుభాకాంక్షలు! ఇది అతని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కావడంతో ఈ విజయం మరింత ప్రత్యేకం. గుల్వీర్ సింగ్ సాధించిన విజయానికి భారత్ గర్విస్తోంది” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పేర్కొంది.
Congratulations to Gulveer Singh on winning the Silver in the Men’s 1500m at the Asian Games! His achievement becomes more special as it was a personal best. India is proud of him: PM @narendramodi pic.twitter.com/zDJOhUksS4
— PMO India (@PMOIndia) September 28, 2026