Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్తవ్య పాలనలో అంకితభావానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


విధులను నిర్వర్తించడంలో అంకితభావాన్ని కలిగివుండే వ్యక్తులు అత్యున్నత స్థాయి పరిపూర్ణతను సాధించగలుగుతారని చెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. శ్రద్ధతో, చిత్తశుద్ధితో కర్తవ్యాలను నిర్వహించే వారు.. అంకిత భావంతో చేసే పనుల వల్ల అత్యున్నత సంతృప్తిని ఎలా పొందవచ్చో గ్రహించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
‘‘స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః
స్వకర్మనిరతః సిద్ధిం యథా విన్దతి తచ్చృణు’’ అన్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
కర్తవ్య పాలనకు అంకితమైన వ్యక్తులు అత్యున్నత స్థాయి పరిపూర్ణతను సాధించగలుగుతారు. ఇందువల్ల అంకితభావంతో, నిజాయతీతో పని చేసి అత్యున్నత స్థాయి పరిపూర్ణతను అందుకోవచ్చని వారు గ్రహించాలని ఈ సంస్కృత సుభాషితం సూచిస్తోంది.

 

***