పిఎంఇండియా
ఆసియా క్రీడల్లో మహిళల 4×400 మీటర్ల రిలే విభాగంలో స్వర్ణ పతకం సాధించిన కిరణ్ పహల్, పూవమ్మ ఎం.ఆర్., ప్రాచీ, విత్య రామ్‌రాజ్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఒక జట్టుగా వారు అద్భుత ప్రతిభ ప్రదర్శించారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
లక్ష్య సాధనపై వారి దృఢ సంకల్పం, వేగం మాతృభూమిని అగ్రస్థానంలో నిలిపాయని పేర్కొంటూ, ఈ విజయం భారత క్రీడారంగానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు.
సమష్టి కృషితో అద్వితీయ ఫలితాలు సాధించగలమని వారి అసాధారణ విజయం నిరూపించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా క్రీడలలో మహిళల 4×400 మీటర్ల రిలే విభాగం స్వర్ణ పతక విజేతలు కిరణ్ పహల్, పూవమ్మ ఎం.ఆర్., ప్రాచీ, విత్య రామ్రాజ్లకు నా హృదయపూర్వక అభినందనలు. మైదానంలో వారి దృఢ సంకల్పం, వేగం భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాయి. ఇది నిజంగా భారత క్రీడారంగానికి ఎంతో గర్వకారణం. సమష్టి కృషితో ఏ లక్ష్యాన్నైనా సాధించగలమని చెప్పడానికి ఇదొక అద్భుత ఉదాహరణ! భవిష్యత్తులోనూ వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
***
Congratulations to Kiran Pahal, Poovamma MR, Prachi and Vithya Ramraj on a magnificent performance in the Women’s 4×400m Relay at the Asian Games. Their speed and determination powered India to the top of the podium. This is a proud moment for Indian athletics and a wonderful…
— PMO India (@PMOIndia) September 29, 2026