పిఎంఇండియా
ఆసియా క్రీడలు-2026లో మహిళల హైజంప్ కాంస్య పతకం సాధించిన పూజకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ క్రీడా విభాగంలో రెండు దశాబ్దాల అనంతరం భారత్కు లభించిన తొలి పతకం ఇదేనని పేర్కొంటూ, ఇదొక చిరస్మరణీయ ఘట్టమని ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులో ఆమె మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షిస్తూ శ్రీ మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“భారత క్రీడారంగం ఆనందోత్సాహాల్లో మునిగితేలాల్సిన ఘట్టమిది! ఆసియా క్రీడలు-2026 మహిళల హైజంప్ విభాగంలో పూజ కాంస్య పతకం సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఆసియా క్రీడలలో రెండు దశాబ్దాల తర్వాత ఈ విభాగంలో భారత్కు లభించిన తొలి పతకమిది. ఇది నిజంగా చిరస్మరణీయ విజయం. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, ఆమెకు నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
***
A proud moment for Indian athletics!
— PMO India (@PMOIndia) September 29, 2026
Congratulations to Pooja on winning the Bronze medal in the Women’s High Jump at the Asian Games 2026. This is India’s first medal in the event at the Asian Games since over two decades. It’s truly a memorable achievement. Best wishes for her… pic.twitter.com/Ah1yJ0vot2