పిఎంఇండియా
తీవ్రంగా గాయపడి, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడటంలో అసాధారణ ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ప్రదర్శించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కెప్టెన్ మచ్చర్ వీరత్వం వందలాది మంది ప్రాణాలను కాపాడటమే కాక, పెను విషాదాన్ని తప్పించిందని ప్రధానమంత్రి అన్నారు.
కెప్టెన్ మచ్చర్ పట్ల భారత్ గర్వపడుతోందని… ఆయన త్వరగా కోలుకుని, మరింత శక్తిమంతంగా, ఆరోగ్యంగా ఉండాలని శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
“కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఓ హీరో.
తీవ్రంగా గాయపడి, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడటంలో అసాధారణ ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ప్రదర్శించారు.
అతను చూపిన వీరత్వం వందలాది మంది ప్రాణాలను కాపాడటమే కాక, పెను విషాదాన్ని తప్పించింది.
కెప్టెన్ మచ్చర్ పట్ల భారత్ గర్వపడుతోంది.
ఆయన త్వరగా కోలుకుని, మరింత శక్తిమంతంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా“.