Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల్లో మహిళల 53 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో రజతం గెలిచిన అంతిమ్ పంగాల్‌కు ప్రధాని అభినందనలు


ఆసియా క్రీడల్లో మహిళల రెజ్లింగ్ 53 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో రజతం గెలుచుకున్న అంతిమ్ పంగాల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

 

ఆమె ఆటతీరు ఆదర్శప్రాయమనీ, అద్భుతమైన ప్రదర్శన కనబరిచారనీ ప్రధానమంత్రి అన్నారు.

 

అంతిమ్ పంగాల్ మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. దేశానికి మరిన్ని పతకాలు తీసుకొచ్చి ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు:

 

‘‘ఆసియా క్రీడల్లో అంతిమ్ పంగాల్ సాధించిన రజతం స్ఫూర్తిదాయకమైనది! మహిళల రెజ్లింగ్ 53 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆమెకు అభినందనలు. ఆమె దేశానికి మరిన్ని విజయాలు సాధించి ఇతర క్రీడాకారులకు స్పూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను: PM @narendramodi”

 

 ***