Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కార్తీక పూర్ణిమ, దేవ్ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


కార్తీక పౌర్ణమి, దేవ్ దీపావళి పవిత్ర సందర్భంలో దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

కార్తీక పౌర్ణమి, దేవ్ దీపావళి పండగల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన పండగ సేవాభావంతో కూడిన పరోపకార సందేశాన్ని అందిస్తుంది. పవిత్ర స్నానాలు, దానధర్మాలు, దీపాలు వెలిగించడంతో సుసంపన్నమైన ఈ సంప్రదాయం ప్రతిఒక్కరి జీవితాల్లో భక్తి, విశ్వాసం, సానుకూలతను నింపాలని ఆశిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు.