పిఎంఇండియా
గుజరాత్ ముఖ్యమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ సేవలు అందించడం మొదలుపెట్టిన తొలినాళ్లలో నేర్చుకోవడానికీ, ఒక జట్టులో సభ్యులంతా ఎలా కలిసికట్టుగా మెలగుతారో అదే తత్వంతో పనిచేయడానికీ, తీవ్రంగా శ్రమించడానికీ ఎంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చిందీ వివరిస్తూ శ్రీ హస్‌ముఖ్ అధియా ఓ వ్యాసాన్ని రాశారు. ఆ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఇవాళ పంచుకున్నారు.
శ్రీ మోదీ అవలంబించిన పద్ధతి పాలనకు ఒక కొత్త దృష్టికోణాన్ని జోడించడమే కాకుండా ఇప్పటికి 25 సంవత్సరాలు గడిచిన ఆయన ప్రజాజీవితం అంతటా మనం గమనించిన పరివర్తనాత్మక నాయకత్వానికి పునాదిని వేసిందని శ్రీ అధియా తన వ్యాసంలో ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తొలుత గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించడం మొదలుపెట్టినప్పుడు– కొన్ని సంవత్సరాల పాటు– నేర్చుకోవడానికీ, ఒక జట్టులో సభ్యులంతా ఎలా కలిసికట్టుగా మెలగుతారో అలాంటి తత్వంతో పనిచేయడానికీ, తీవ్రంగా శ్రమించడానికీ ఎంతో ప్రాధాన్యాన్నిచ్చారు. ఈ విధానం పాలనకు ఒక కొత్త దృష్టికోణాన్ని జతచేయడమే కాకుండా, ప్రజాజీవన రంగంలో ఆయన వెచ్చించిన గత 25 సంవత్సరాల కాలంలో మనం గమనించిన విధంగా ఆయన నాయకత్వానికి సరికొత్త రూపురేఖలను కూడా అందించిందని శ్రీ హస్‌ముఖ్ అధియా తన వ్యాసంలో గుర్తుచేశారు.
నమో యాప్ (NaMo App) లోని
https://www.hindustantimes.com/india-news/a-glimpse-at-early-years-of-narendra-modi-as-the-chief-minister-of-gujarat-101791334808987.html నుదర్శించగలరు” అని పేర్కొంది.
***
PM @narendramodi's early years as Gujarat CM reflected a strong focus on learning, teamwork and hard work. Shri Hasmukh Adhia recalls how this approach brought a new vision to governance and shaped the leadership seen throughout his 25 years in public life. https://t.co/OpoNwm3oWV via NaMo App
— PMO India (@PMOIndia) October 7, 2026