Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశ వృద్ధి, వికసిత్ భారత్ – 2047 కోసం నిర్మించిన బలమైన పునాదుల గురించి వివరించే వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని


25 ఏళ్ల ప్రధాని పాలనా ప్రస్థానంలో భారతదేశ అభివృద్ధి వేగం ఎలా పెరిగిందీ వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ ‌లాల్ ఖట్టర్ రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పంచుకున్నారు.

ఈ సమయం… డిజిటల్ టెక్నాలజీ, మౌలిక వసతుల నుంచి తయారీ, సామాజిక సంక్షేమం వరకు భారతదేశ తదుపరి వృద్ధి దశకు, వికసిత్ భారత్–2047 దార్శనికతకు బలమైన పునాదులు వేసిన విధానాన్ని శ్రీ ఖట్టర్ వివరించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని కార్యాలయం పోస్టు:

‘‘ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పరిపాలనా కాలంలో భారతదేశ అభివృద్ధి వేగం అనేక రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ రాశారు.

ఈ కాలం.. డిజిటల్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల నుంచి తయారీ రంగం, సామాజిక సంక్షేమం వరకు భారతదేశ తదుపరి వృద్ధి దశకు, వికసిత్ భారత్ – 2047 వరకు అవసరమైన బలమైన పునాదులను వేసింది.’’