Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా గేమ్స్‌ కాంస్య పతక విజేత ప్రదీప్‌ కుమార్‌కు ప్రధానమంత్రి ప్రశంసలు


ఆసియా పారా గేమ్స్‌-2026 పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్‌43/ఎఫ్‌44/ఎఫ్‌62/ఎఫ్‌64 విభాగం)లో కాంస్య పతకం సాధించడంతోపాటు వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు నమోదు చేసిన ప్రదీప్ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

తన శారీరక పరిమితులను అధిగమించడంలో అతడు చూపిన నిబద్ధత ఎంతో అభినందనీయమంటూ- శ్రీ మోదీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

 

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

 

“ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్43/ఎఫ్44/ఎఫ్62/ఎఫ్64 విభాగం)లో ప్రదీప్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. ఈ క్రమంలో అతడు తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు నమోదు చేయడం విశేషం. తన శారీరక పరిమితులను అధిగమించడంలో ఆయన అంకితభావం, దీక్ష ఎంతో అభినందనీయం. అతనికి నా హృదయపూర్వక అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.