Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారాక్రీడల్లో రజతం కైవసం చేసుకున్న రాకేశ్‌కు ప్రధాని అభినందనలు


ఆసియా పారాక్రీడల్లో పురుషుల డిస్కస్ త్రో ఎఫ్43/ఎఫ్44/ఎఫ్62/ఎఫ్64 విభాగంలో రజతం సొంతం చేసుకున్న రాకేశ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు.

 

తన ప్రతిభతో దేశానికి అపారమైన ఆనందాన్ని తీసుకొచ్చారని శ్రీ మోదీ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

సామాజికమాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

 

‘‘తన అద్భుతమైన ప్రతిభతో దేశానికి రజత పతకాన్ని తీసుకొచ్చారు రాకేశ్!

 

పురుషుల డిస్కస్ త్రో ఎఫ్43/ఎఫ్44/ఎఫ్62/ఎఫ్64 విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి దేశానికి అపారమైన గొప్పతనాన్ని తీసుకొచ్చారు. ఆయనకు అభినందనలు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా: పీఎం మోదీ’’

 

***