Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా గేమ్స్‌ కాంస్య పతక విజేత హోకాటో హోటోఝే సెమాకు ప్రధానమంత్రి అభినందనలు


ఆసియా పారా గేమ్స్‌-2026 పురుషుల షాట్ పుట్ ఎఫ్‌56/ఎఫ్‌57 ఈవెంట్‌లో చక్కటి త్రో ద్వారా కాంస్య పతకం గెలుచుకున్న హోకాటో హోటోఝే సెమాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

 

మునుపటి ఈ క్రీడల ప్రదర్శనతో పోలిస్తే అతడు తన ప్రతిభను మెరుగుపరచుకున్నాడని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు తన అభిరుచిని, అంకితభావాన్ని కనబరచడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ అతడు భారత క్రీడా పతాకను మరింత సమున్నతంగా ఎగురవేయాలని ఆకాంక్షించారు.

 

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

 

“ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల షాట్ పుట్ ఎఫ్‌56/ఎఫ్‌57 ఈవెంట్‌లో హోకాటో హోటోఝే సెమా అద్భుతంగా రాణించి కాంస్య పతకం సాధించాడు. ఇంతకుముందు ఇదే క్రీడల నాటి తన ప్రతిభను మెరుగుపరచుకోవడం ద్వారా తన గొప్ప అభిరుచిని, అంకితభావాన్ని చాటిచెప్పాడు. అతనికి నా అభినందనలతోపాటు భారత్‌కు అతడు నిరంతరం గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.