ఆసియా పారా క్రీడల్లో పురుషుల 65 కిలోల విభాగం పారా పవర్లిఫ్టింగ్లో రజత పతకం సాధించిన అశోక్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసి గర్విస్తున్నానని, అతడి అద్భుత ప్రదర్శన ప్రశంసనీయమని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అశోక్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
“అశోక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు! ఆసియా పారా క్రీడలు – 2026లో పురుషుల 65 కిలోల విభాగం పారా పవర్లిఫ్టింగ్లో రజత పతకం సాధించినందుకు అభినందనలు. అశోక్ పట్టుదల, ఆత్మవిశ్వాసం గర్వకారణం. భవిష్యత్తులో కూడా అశోక్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్టు ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది.
***
An outstanding performance by Ashok! Congratulations on winning the Silver in the Men's -65kg Para Powerlifting event at the Asian Para Games 2026. Proud of his perseverance and self-belief. Best wishes for the upcoming endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026