ఒడిషాలోని భువనేశ్వర్‌లో భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ఏర్పాటు చేసిన డేటా సెంటర్, సైబర్ భద్రత శిక్షణ సంస్థను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరి సంక్షేమానికి మహాప్రభు పూరీ జగన్నాథుని ఆశీస్సులు కోరుతూ- నవ భారతానికి భువనేశ్వర్ ఓ కొత్త, కీలక సంస్థను బహూకరించిందని ఆయన అభివర్ణించారు. ‘ఆర్బీఐ’తోపాటు ఈ రెండు కేంద్రాల ప్రారంభోత్సవంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. “ఈ కేంద్రంతో ఒడిషా ప్రజలకే కాకుండా యావద్దేశానికీ ఎంతో ప్రయోజనం కలుగుతుంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఈ ప్రారంభోత్సవ విస్తృత ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దేశ పాలన విధానంలో ఒక మౌలిక మార్పును ఇది సూచిస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి ప్రాధాన్యం, దాని పరిధిని విస్తరించడంతోపాటు చివరి అంచెదాకా నిరంతరాయ సేవల ప్రదానం తదితరాలపై అంశాలపై సమకాలీన పాలన ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. “పరిపాలనపై దేశ ప్రజల దృక్పథంలో వచ్చిన పరిణామాలకు నేటి కార్యక్రమమే నిదర్శనం” అని ఆయన శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
సమతుల ప్రాంతీయ ప్రగతి, పేదల ఆత్మగౌరవం, ఏ ఒక్కరూ వెనుకబడకుండా చూడటంపై దృష్టి సారిస్తూ ప్రజోపయోగా, క్రియాశీల సుపరిపాలన దిశగా మార్పును ప్రధానమంత్రి వివరించారు. ఇప్పుడు ఎక్స్ ప్రెస్వేలతో చిన్న పట్టణాలకూ అనుసంధానం ఏర్పడుతోందన్నారు. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు అనేక రాష్ట్రాలకు విస్తరించాయని, చిన్న పట్టణాల్లోనూ వైద్య కళాశాలలు ప్రారంభం అవుతున్నాయని గుర్తు చేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. డిజిటల్ అనుసంధానం మారుమూల ప్రాంతాలకూ విస్తరిస్తోందని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. “జనజీవన సౌలభ్య కల్పన, వారి కలలకు తగిన కొత్త అవకాశాల కల్పనే నేడు సుపరిపాలన వాస్తవిక ధ్యేయం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
దేశంలోని బ్యాంకులను 1960, 1970 దశకాలలో పేదలకు మేలు పేరిట బ్యాంకులను జాతీయం చేసినప్పటికీ, 2014 దాకా జనాభాలో సగానికి పైగా పేదలు ఆ వ్యవస్థకు వెలుపలే ఉండిపోయారని పేర్కొన్నారు. మరోవైపు మధ్యతరగతి వారికీ బ్యాంకు రుణాల మంజూరు అందని మానిపండుగా, చిన్న రైతులతోపాటు భూమిలేని పేదలు, మహిళలకు దుస్సాధ్యంగా ఉండేదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే, దేశంలో నెలకొన్న ఈ దుస్థితిని ఆర్థిక సార్వజనీన ఆధునిక శకం పూర్తిగా మార్చివేసిందన్నారు. “డిజిటల్ బ్యాంకింగ్ దేశంలో నేడు ప్రతి ఒక్కరినీ 24 గంటల సేవల ప్రదానంతో అనుసంధానించింది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
అలాగే “డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా దేశంలోని ప్రతి కుటుంబం ఇవాళ లబ్ధి పొందుతోంది” అని శ్రీ మోదీ ప్రకటించారు. నిధుల స్వాహా మాటే నేడు వినిపించడం లేదని, ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో ప్రతి రూపాయి ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాకు యథాతథంగా చేరిపోతున్నదని వివరించారు. “దేశంలో దాదాపు 60 కోట్ల జన్‌ధన్ పేరిట పొదుపు ఖాతాలు తెరవడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఎటువంటి పూచీకత్తు ఇవ్వలేని వ్యక్తులకూ ఇప్పుడు వ్యాపారారంభానికి స్వల్ప వడ్డీతో అధికారిక రుణం లభిస్తున్నదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. లక్షిత చర్యల ద్వారా చిన్న పారిశ్రామికవేత్తలు, సంప్రదాయ కళాకారులు, వీధి వ్యాపారులు, అసంఘటిత కార్మికులు పురోగమిస్తుండటాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో తొలిసారి ముద్రా యోజన కింద 13 కోట్ల మంది పారిశ్రామికవేత్తలుగా మారారని చెప్పారు. ‘పీఎం స్వానిధి’, పీఎం విశ్వకర్మ పథకం తదితరాల ద్వారా లక్షలాది వీధి వ్యాపారులు, నిపుణ కళాకారులకు రుణాలు లభించాయన్నారు. ఇక దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది గ్రామీణ మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వయం సహాయ సంఘాలకు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయం లభించిందని పేర్కొన్నారు. “వారంతా తొలిసారి అధికారిక బ్యాంకింగ్ సేవల ప్రయోజనం పొందగలిగారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
నేడు ఆత్మగౌరవం, స్వావలంబనకు ప్రతీకగా నిలిచిన కోట్లాది రూపే కార్డులు దేశంలోని ప్రతి పౌరునికీ అందుబాటులోకి వచ్చాయన్నారు. అయితే, ఒకనాడు డెబిట్-క్రెడిట్ కార్డులు కేవలం ధనవంతులకే పరిమితమయ్యాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రూపాంతరీకరణకు బ్యాంకింగ్ వర్గమే కారణమని ప్రధానమంత్రి కొనియాడారు. భారత రిజర్వు బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, దేశంలోని ప్రతి బ్యాంక్ ఉద్యోగి సమష్టి కృషే అందుకు కారణమని ఆయన కొనియాడారు. “ఈ ఘనతలో మీకందరికీ వాటా ఉంది” అని ప్రధాని మోదీ అభినందించారు.
‘పౌర దేవోభవ’ తారకమంత్రంగా ఆర్థిక సాధికారత సహా సామాజిక భద్రత వలయం అసాధారణంగా విస్తరించిందని ప్రధానమంత్రి వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ- ‘అటల్ పెన్షన్ యోజన’ కింద ఒడిషాలో 38 లక్షలు సహా 9 కోట్ల మంది పౌరులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. అలాగే, 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కోసం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో ‘పీఎం సురక్షా బీమా యోజన’ లభిస్తున్నదని చెప్పారు. సంవత్సరానికి 450 రూపాయల లోపు ప్రీమియంతో ‘పీఎం జీవన్ జ్యోతి యోజన’ కింద జీవిత బీమా రక్షణ లభిస్తున్నదని వెల్లడించారు. ఒకప్పుడు బీమా అంటే విలాసంగా పరిగణనలో ఉండేదని, నేడు పేద-మధ్యతరగతి ప్రజలకూ ఈ సౌలభ్యం కలిగిందని పేర్కొన్నారు. లోగడ ఇలాంటివాటిపై ప్రభుత్వాలు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో భారీ ప్రకటనలతో ఊదరగొట్టేవని గుర్తుచేశారు. ఇవాళ ఎలాంటి ఆర్భాటానికీ తావులేకుండా కష్టకాలంలో గల కుటుంబాలకు రూ.25,000 కోట్లకు పైగా క్లెయిమ్‌లను నిశ్శబ్దంగా పంపిణీ చేశారని ఆయన పేర్కొన్నారు. “సుపరిపాలనంటే ఇదే!” అని శ్రీ మోదీ నొక్కి చెప్పారు.
గడచిన దశాబ్ద కాలంలో బ్యాంకింగ్ అందుబాటులో లేని ప్రజలందరికీ ఆ సేవల ప్రదానంపై దృష్టి సారించామని ప్రధానమంత్రి చెప్పారు. ఇక రాబోయే దశాబ్దంలో ఒడిషాలో ఇవాళ ప్రారంభించిన డేటా సెంటర్ ద్వారా, పటిష్ట కంప్యూటింగ్ వ్యవస్థల మద్దతుతో బ్యాంకింగ్‌ను మరింత సమర్థం, విశ్వసనీయంగా మార్చడంపై శ్రద్ధ చూపుతామని పేర్కొన్నారు. ఇక ఆధునిక యుద్ధరీతులు నేడు ప్రగతిపై సైబర్ దాడుల ద్వారా ఆర్థిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ప్రధానమంత్రి హెచ్చరించారు. ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా ఏ దేశమైనా తన ఆర్థిక వ్యవస్థను సైబర్ దోపిడీదారులు, ఉగ్రవాదుల నుంచి కాపాడుకోవడానికి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. కాలం చెల్లిన శిక్షణోపకరణాల స్థానంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, నిపుణ మానవ వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన ఉద్ఘాటించారు. “ఈ సందర్భంలోనే నేటి ఆధునిక సైబర్ భద్రత శిక్షణ సంస్థ పాత్ర కీలకమవుతుంది” అని ప్రధాని మోదీ వివరించారు.
వికసిత భారత్ సంకల్ప సాకారంలో తూర్పు భారతం శక్తిమంతమైన ప్రగతి చోదకశక్తి కాగలదని ప్రధానమంత్రి చెప్పారు. ఒడిషాలో ప్రస్తుత ప్రభుత్వ ఆధ్వర్యాన పురోగమన వేగం పుంజుకోవడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. గనుల నుంచి మైక్రోచిప్‌ల దాకా కొత్త భవిష్యత్ ప్రగతి గాథను లిఖించేందుకు ఆ రాష్ట్రం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు ఈ మేరకు తన సంప్రదాయ ఖనిజాధారిత పరిశ్రమలను సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, ఆధునిక కంప్యూటింగ్ వంటి కొత్త వ్యవస్థలతో జత చేస్తోందని గుర్తుచేశారు. ఈ కొత్త బాటలో నడవడం ద్వారా అపార అవకాశాలు అందివస్తాయని, రాష్ట్ర యువత కలలన్నీ సాకారం కాగలవని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. చివరగా- పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, ‘జై జగన్నాథ్’ అని నినదిస్తూ- “ గనుల నుంచి మైక్రోచిప్‌ల దాకా ఒడిషా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తోంది చూడండి” అని ధీమా వెలిబుచ్చుతూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.
***
A major step towards a more secure financial system. The RBI's new facilities in Bhubaneswar will strengthen digital infrastructure and cybersecurity capabilities. @RBI https://t.co/ryignasX8k
— Narendra Modi (@narendramodi) October 25, 2026
महाप्रभु के आशीर्वाद से, आज भुवनेश्वर... नए भारत को एक नया संस्थान दे रहा है। भुवनेश्वर में RBI के Data Centre और Cybersecurity Training Institute... इन दोनों का उद्घाटन एक महत्वपूर्ण अवसर है। ये ओडिशा और देश के लोगों के बहुत हितकारी होगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 25, 2026
हम Pro-People, Pro-Active, Good Governance का model लेकर चले। हमारे लिए विकास का मतलब है... भारत का संतुलित विकास... गांवों को भी अवसर...छोटे शहरों को भी अवसर: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 25, 2026
आज भारत में digital banking ने सबको 24 घंटे banking सेवाओं से जोड़ा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 25, 2026
जिसके पास bank को guarantee देने के लिए कुछ भी नहीं है, वो भी आज bank से सस्ता और सुलभ loan लेकर अपना कोई काम शुरू कर पा रहा है। छोटे उद्यमी से लेकर पारंपरिक कारीगर तक... रेहड़ी-पटरी वाले से लेकर असंगठित क्षेत्र के श्रमिक तक... पहली बार उन्हें formal banking का फायदा मिला है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 25, 2026
बीता दशक, banking को उन तक लोगों तक पहुंचाने का था... जो इससे वंचित था। आने वाला दशक... Banking को अधिक efficient, अधिक भरोसेमंद बनाने का है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 25, 2026
आजकल युद्ध केवल हथियारों से नहीं लड़े जाते। किसी देश को कमज़ोर करना है तो उसकी economy पर attack करके भी ये किया जा सकता है। और जब भारत, आर्थिक रूप से सशक्त हो रहा है तो हमें अपने banking system को भी cyber लुटेरों, cyber आतंकियों से सुरक्षा देनी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 25, 2026