ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్.. బస్తర్‌లోని కరణ్‌పూర్‌లో గల కోబ్రా ఆపరేషన్స్ బేస్‌లో జవాన్లతో కలిసి దీపావళి పండుగ చేసుకున్నప్పటి ముఖ్యాంశాలను ప్రస్తావించారు.
ఈ వేడుకలను నిర్వహించుకోవడం బస్తర్‌లో దీపావళి పండుగ ఉత్సాహాన్ని చాటి చెబుతోందని, ఇది భద్రతాదళాల అంకితభావంతోనే సాధ్యమైంది అని శ్రీ మోదీ అన్నారు. నక్సలిజం ఇక గత కాలపు అధ్యాయంగా మారిందని, ఇప్పుడు ఇక అభివృద్ధే మన ముందున్న మార్గమని శ్రీ మోదీ అన్నారు. ఈ పర్వదినం ఎంతో విశేషమైందీ, మరపురానిదీనూ అని శ్రీ మోదీ వర్ణించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘బస్తర్‌లో దీపావళి.. ఈ ఖ్యాతి అంతా మన భద్రతాదళాలకే దక్కుతుంది.
నక్సలిజం గత కాలపు అధ్యాయంగా మారిపోయింది.
ఇకమీదట అభివృద్ధే మన ముందున్న మార్గం .
ఈ రోజు చాలా ప్రత్యేకం, మరపురాని రోజు.’’
‘‘బస్తర్‌లో దీపావళి ఉత్సాహం సుస్పష్టంగా వ్యక్తమవుతున్నది.’’
Diwali in Bastar…all thanks to our security forces! Naxalism is history. Development is the way ahead. Today was special and memorable. https://t.co/cHok2iVtd8
— Narendra Modi (@narendramodi) November 8, 2026
Diwali spirit on full display in Bastar! https://t.co/KGAWwb12CB
— Narendra Modi (@narendramodi) November 8, 2026