మహాపర్వదినమైన ఛఠ్ సంధ్యా అర్ఘ్య సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రకృతి ఆరాధనకు అంకితమైన ఈ పవిత్ర పర్వదినం అందరిలోనూ నూతన చైతన్యాన్నీ, జీవశక్తినీ నింపాలని, సమాజంలో సామరస్యాన్నీ, సామాజిక ఐక్యతనూ మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఛఠీ మాతకు నమస్సులు అర్పించారు. సూర్యదేవుని అనుగ్రహంతో అందరి జీవితాల్లోనూ వెలుగు నిండాలని కోరుకున్నారు.
సామాజిక మాధ్యయం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:
‘‘దేశప్రజలందరికీ మహాపర్వదినమైన ఛఠ్ సంధ్యా అర్ఘ్య శుభాకాంక్షలు. ప్రకృతి ఆరాధనకు అంకితమైన ఈ పవిత్ర సందర్భం అందరిలోనూ నూతన చైతన్యాన్నీ, ఉత్తేజాన్నీ నింపాలని, సమాజంలో సద్భావననూ, సామరస్యాన్నీ మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. సూర్యదేవుని కృపతో అందరి జీవితాల్లోనూ వెలుగులు నిండాలి. జై ఛఠీ మాతా!’’
***
सभी देशवासियों को महापर्व छठ के संध्या अर्घ्य की अनेकानेक शुभकामनाएं। प्रकृति-पूजन को समर्पित यह पावन अवसर हर किसी के लिए नई चेतना और स्फूर्ति लेकर आए, साथ ही समाज में सद्भाव एवं समरसता को और अधिक प्रगाढ़ करे। सूर्यदेव की कृपा से सभी का जीवन आलोकित हो। जय छठी मइया!
— Narendra Modi (@narendramodi) November 15, 2026