Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రైతుల సౌభాగ్యాన్ని పెంచడంతో పాటు గ్రామీణ భారతాన్ని బలోపేతం చేస్తున్న పరివర్తనాత్మక కార్యక్రమాలపై వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. స్వదేశీ టీకా మందుల తయారీ గత 12 సంవత్సరాల్లో పశుగణాన్ని సాంక్రామిక వ్యాధుల నుంచి రక్షించడంలో ఏ విధంగా కీలక పాత్రను పోషిస్తున్నదీ మంత్రి తన వ్యాసంలో ప్రస్తావించారు. ఈ ప్రయత్నాలు పశువుల ఆరోగ్యాన్ని కాపాడటం, వ్యాధులతో వచ్చే నష్టాలను తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు రైతుల జీవన స్థాయిని మెరుగుపరచడానికి దోహదం చేశాయి.

స్వదేశీ టీకాలను రూపొందించడం పశువుల ఆరోగ్యసంరక్షణ రంగంలో భారత్ సామర్థ్యాలు విస్తరిస్తున్న ధోరణిని ప్రతిబింబిస్తోందనీ, అంతేకాక ఈ పరిణామం వ్యవసాయ రంగంలో దృఢ, స్వయంసమృద్ధ విస్తారిత అనుబంధ వ్యవస్థను నిర్మించడంలో భారత్ నిబద్ధతను కూడా చాటుతోందనీ శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘గత 12 సంవత్సరాల్లో రైతు సోదరీ, సోదరుల సౌభాగ్యంతో పాటు గ్రామీణ భారత్‌ను శక్తిమంతమైందిగా తీర్చిదిద్దే దిశగా కూడా అనేక చరిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నారు. స్వదేశీ టీకాలను అభివృద్ధిపరచడంతో సాంక్రామిక వ్యాధుల నుంచి పశు, పక్ష్యాదులను సురక్షితంగా ఉంచడంలో ఏ విధంగా తోడ్పాటు లభిస్తోందో మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ తన వ్యాసంలో సమగ్రంగా వివరించారు. దీంతో రైతుల ఆదాయం వృద్ధి చెందడమే కాక, వారి జీవితాలు కూడా మెరుగుపడి, సౌలభ్యాన్ని సంతరించుకున్నాయి’’ అని పేర్కొన్నారు.

***