Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ రామ్‌రావ్ వాడ్కుటే మృతిపై ప్రధానమంత్రి సంతాపం


రాజ్యసభ సభ్యుడు శ్రీ రామ్‌రావ్ వాడ్కుటే మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సంతాపం తెలిపారు. సమాజానికి, పేదలకు, అణగారిన వర్గాలకు సేవపై ఆయన అంకిత భావం చిరస్మరణీయమని శ్రీ మోదీ అన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“రాజ్యసభ సభ్యులు శ్రీ రామ్‌రావ్ వాడ్కుటే కన్నుమూతపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. సమాజ సేవతోపాటు పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి దిశగా ఆయన అంకిత భావం చిరస్మరణీయం మహారాష్ట్రలో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కృషి కూడా అంతే ప్రశంసనీయం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను… ఓం శాంతి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***