తొమ్మిది నెలల కన్నా తక్కువ వ్యవధిలోనే కోటికి పైగా హెచ్పీవీ వ్యాక్సిన్లతో చరిత్రాత్మక మైలురాయిని సాధించిన దేశవ్యాప్త హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా ఏటా అర్హులైన బాలికల్లో దాదాపు 87 శాతం మందికి టీకాలను అందించారు.
ముందస్తు ఆరోగ్య రక్షణ సేవల ద్వారా దేశంలోని ఆడబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించే దిశగా ఈ విజయం ఒక కీలకమైన ముందడుగని శ్రీ మోదీ పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేందుకు కృషి చేసిన భాగస్వాములందరి సమష్టి నిబద్ధత, సమన్విత చర్యలకు ఇది నిదర్శనమన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
ముందస్తు ఆరోగ్య సంరక్షణ దిశగా మన ప్రయాణంలో ఇదొక కీలకమైన మైలురాయి.
గర్భాశయ క్యాన్సర్ నుంచి బాలికలను రక్షించి, వారికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించే దిశగా ప్రతీ డోస్ ఒక ముందడుగు.
సమష్టి కృషితో ఈ అద్భుత విజయాన్ని సాధ్యమయ్యేలా చేసిన భాగస్వాములందరికీ నా అభినందనలు.
Prime Minister shares Sanskrit Subhashitam highlighting essential qualities that sustain prosperityA significant milestone in our journey towards preventive healthcare. Every dose is a step towards protecting girls from cervical cancer and ensuring a healthier future for them. I commend all the stakeholders whose efforts have ensured this remarkable feat.
— Narendra Modi (@narendramodi) November 23, 2026