Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తమిళ నాడు తిరుచిరాపల్లిలో రోడ్డు ప్రమాదం.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


తమిళ నాడు తిరుచిరాపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు శ్రీ మోదీ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
మృతుల్లో ప్రతి ఒక్కరికీ  రూ.2 లక్షల వంతున, గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్‌గ్రేషియాను సంబంధిత కుటుంబాలకు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘తమిళ నాడు.. తిరుచిరాపల్లిలో రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరిగిందని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియచేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ  రూ.2 లక్షల వంతున పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను వారి ఆత్మీయులకు ఇస్తాం. గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున అందిస్తాం: ప్రధానమంత్రి 

PM @narendramodi’’.‌